Monday, July 21, 2008

ఎంపీల రేట్ల గోల (M.P. la rETla gOla)

మా ఈధి సివర చేపల బజారు వేపు ఎల్లాలంటే ప్రతీవోడికి భయమే! ఒకవేళ ఎల్లినా ఎంకమ్మ, ఎల్లమ్మల గొడవ వినకుండా ఎవడూ రాడు. వాల్లెవరంటారా.... చేపల దుఖాణం ప్రత్యర్ధులు. రాజకీయాల్లోలా చేపల బజారులో కూడ ప్రత్యర్ధులు ఉంటారా అంటె..ఉంటారనే సెప్తారు మా ఈధిలొ వోల్లు. ఎంకమ్మ, ఎల్లమ్మల నోల్లు అలాంటివి మరి. ఒకరు కేజి చేపలు పది రూపయలాంటె మరొకరు 9 రూపాయలంటారు. ఒక్కొక్కసారి ఇద్దరు అనుకొని అమాంతం ఇరవై రూపయలకి పెంచెత్తారు. ఇది వాళ్ళ వరస.....
సరిగ్గా ఇలాటి ఇడ్డూరమే మన దేశ రాజకీయాల్లొ ప్రస్తుతం కనిపిస్తంది. అదేనండి మన ఎంపీల రేట్ల గోల!
"సపోర్టు ఇలా తీసెయ్యగానే, రేటు అలా పెరిగింది"...అచ్చుతప్పు.. "సపోర్టు ఇలా తీసెయ్యగానే, రేటు అలా ఫిక్స్ అయింది".
1993 లో 7-10 లచ్చలు...
1999 లో దానికి డబలు...
2008 లో ఏకంగా 30 కోట్లు (ఎమ్మార్పి.. అంటె 'మినిమం' రిటైల్ ప్రైస్)...
మా లెక్కల మాష్టరుకి కూడ అంతు పట్టలెదు ఈ లెక్క... అర్థమెటిక్స్, జామెట్రి, త్రికోణమితి...వాడెక్క ఏ సూత్రం కూడ పనిచేయలేదు...
ప్రస్తుత పరిస్థితిలో ఇద్దరు ముగ్గురు సభ్యులున్న సిన్న పార్టీలదే సందడంతా..!! మంత్రి పదవి కావాలని, నెస్ట్ ఎలచ్చన్లలో ఎక్కువ సీట్లు కావాలని, గనులులని జాతీయం సేయాలని..ఒకట రెండా ఎన్ని కోరికలు..!!!! ఐనా వాల్ల తప్పేముంది...... ఎప్పుడో గాని రాదు కదా ఇట్టాంటి అవకాశం.....అందుకే దీపం వుండగానే ఇల్లు సర్దుకుంటున్నరు...
కాని సగటు ఓటరు మాత్రం తెగ ఫీల్ అవుతున్నాడు...అవ్వడా మరి? తన వోటు వందకో, రెండొదలకో అమ్ముడు పొయి...తన ఓటుతొ గెలిచిన ఎంపీగారి వోటు 30 కోట్లు పలుకుతుంటె...ఎవరికి కోపంగా ఉండదు!?
సేపల బజారులో రేటు బహిరంగంగా ఫిక్స్ అవుతుంది..రాజకీయాల్లో రేటు తెరవనుక డిసైడ్ అవుతుంది..
అన్నట్లు, రేపు లోక్-సభలో యు.పి.ఎ. పెభుత్వానికి ఇశ్వాస పరీచ్చంట...! సూద్దాం, ఏ పార్టీ గెలుత్తాదో..!

.........సూరమ్మత్త

2 comments:

Aruna said...

Naaku gayyali characters baaga nachutaayi.. mentality matching avvaDam valla anukunTa..[:P] naa blaagu linkullO kalipeskunTunna ,mee blaagu ni, soorammatta gaaru. haaa haa hha hha(vilan type smile)[:D]

Anonymous said...

Hi Soorammatta,
This is Aruna from Arunam.blogspot.com
I work for AndhraJyothy, Hyd
Pls visit my blog again, and leave ur affectionate comment.